Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. సరైన ఆహారపు అలవాట్లతో పాటు రోజువారీ వ్యాయామం కూడా ఇంపార్టెంట్. నడక వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అది అందరికీ తెలుసు. కానీ జాగింగ్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 45 నిమిషాల పాటు నడవడం కంటే 10 నిమిషాల జాగింగ్ చేస్తే సరిపోతుంది.
జాగింగ్ :
10 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల 100 నుండి 150 కేలరీలు ఖర్చవుతాయి. ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి 10 నిమిషాలు జాగింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు జాగింగ్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Sukumar: పుష్ప ఇలా జరిగిందేమిటి? కంటతడి పెట్టిన సుకుమార్.. ఓదార్చిన బన్నీ!
నడక:
Health Tips: వేగంగా నడవడం వల్ల 45 నిమిషాల్లో 200 నుంచి 300 కేలరీలు ఖర్చవుతాయి. నడక మంచి కార్డియో వ్యాయామం. కీళ్ల సమస్య ఉన్నవారు జాగింగ్ చేయకూడదు. కానీ వాకింగ్ మాత్రం అందరూ చేయవచ్చు. నడక బీపీతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే నడక వల్ల కేలరీలు బర్న్ కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.
వాకింగ్ – జాగింగ్ లో ఏది బెటర్..
Health Tips: జాగింగ్ – వాకింగ్ రెండూ వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. రెండూ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ జాగింగ్ చేసేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. జాగింగ్ గుండె, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. హైబీపీ రోగులకు నడక మంచిది.మోకాలి కీళ్ల నొప్పులకు నడక మంచిది. నడిచేటప్పుడు కీళ్ల సమస్య ఉండదు. ప్రమాదం తక్కువ. కీళ్ల నొప్పులు లేదా శస్త్రచికిత్సలు ఉంటే నడవడం బెటర్. జాగింగ్ అనేది కాస్త భారీ వ్యాయమం కాబట్టి ఇది కీళ్ల సమస్య ఉన్నవారికి ఇబ్బంది అవుతుంది.
జాగింగ్ – వాకింగ్ యొక్క లాభనష్టాలు
Health Tips: రెండు వ్యాయామాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. జాగింగ్ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. నడక డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రకృతిలో నడవడం తాజా అనుభూతిని కలిగిస్తుంది. నడుస్తున్నప్పుడు గుండె కొట్టుకోవడం సాధారణంగా ఉంటుంది. దీంతో టెన్షన్ తగ్గుతుంది. వేగంగా నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి.

