haryana

Haryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అక్టోబర్ 5న ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు జరగనున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 930 మంది పురుషులు, 101 మంది మహిళలు ఉన్నారు. ఓటింగ్ కోసం 20,632 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 73 జనరల్ స్థానాలు, 17 ఎస్సీ రిజర్వ్ స్థానాలు కలిపి మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 14 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్తవానికి హరియాణా ఎన్నికలు అక్టోబర్ 1న జరగాల్సి ఉన్నా కొన్ని పార్టీల విజ్ఞప్తితో ఈసీ 5కు వాయిదా వేసింది. సాయంత్రం 06:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అక్టోబర్ 8న (మంగళవారం) జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. “నేను అసెంబ్లీ ఎన్నికల మధ్య జమ్మూ కాశ్మీర్ , హర్యానాకు వెళ్లాను. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. హర్యానాలో వాతావరణం చాలా బాగుంది. మేము అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము” అని భోపాల్‌లో విలేకరులతో చౌహాన్ అన్నారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా మెజారిటీ సాధించకపోవడంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. బీజేపీకి 40 సీట్లు, కాంగ్రెస్‌కు 31 సీట్లు వచ్చాయి. జేజేపీకి 10 సీట్లు వచ్చాయి, ఐఎన్‌ఎల్‌డీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇతరులకు 8 సీట్లు వచ్చాయి. హర్యానా అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 45. దీని కారణంగా, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని JJP తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Srisailam: నల్లమల ఘాట్‌ రోడ్డులో బస్సుల ఢీ – ట్రాఫిక్‌ జామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *