Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీవివాస్ నటించిన పలు చిత్రాల షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. తాజాగా బెల్లంకొండ మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు వినిపిస్తోంది. ‘పొలిమేర’ చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ కథ వినిపించాడట. అది నచ్చటంతో బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో మొదలు పెడతారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటను కూడా త్వరలో చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Aamir Khan: ఉపేంద్ర సినిమాకు ఆమీర్ ప్రశంసలు!
Bellamkonda Sai Sreenivas: ఇక శేఖర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ‘టైసన్ నాయుడు’ 80 శాతం పూర్తయింది. నారా రోహిత్, మంచు మనోజ్ తో కలసి విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లకొండ నటిస్తున్న తమిళ ‘గరుడన్’ రీమేక్ ‘భైరవం’ కూడా దాదాపు పూర్తి అయింది. ఇవికాకుండా ఫైన్ స్క్రీన్స్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ తో పాటు మూన్ షైన్ పిక్చర్స్ పై లుధీర్ రెడ్డి సినిమాలో కూడా నటిస్తున్నాడు బెల్లంకొండ. సో వచ్చే ఏడాది బెల్లకొండ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట. మరి ఈ చిత్రాలతో బెల్లంకొండ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
