aamir khan

Aamir Khan: ఉపేంద్ర సినిమాకు ఆమీర్ ప్రశంసలు!

Aamir Khan: దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెగా ఫోన్ పట్టాడు కన్నడ, తెలుగు భాషా చిత్రాల నటుడు ఉపేంద్ర. 2015లో ‘ఉప్పి2’ తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ తో ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచే కాదు చిత్రపరిశ్రమ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ట్రైలర్ బాగుందని చెబుతూ తను ఉపేంద్రకు వీరాభిమానిని అన్నాడు. కంటెంట్ ఎంతగానో బాగుందని సినిమా పెద్ద స్థాయి విజయాన్ని సాధిస్తుందని, బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తారంటూ యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాను వంద కోట్ల బడ్జెట్ తో లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్ టైనర్స్ కలసి నిర్మించాయి. రేష్మా, సన్నిలియోన్, సాధుకోకిల, జిషుసేన్ గుప్తా, మురళీశర్మ, ఇంద్రజిత్ లంకేష్, నిధి సుబ్బయ్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు అజనీశ్ లోకనాధ్ సంగీతం అందించారు. దీనిని తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *