Chittoor

Chittoor: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలో ఏనుగు హల్‌చల్‌

Chittoor: అడవి దాటి …అందరూ ఉండే చోటికి వచ్చింది. వచ్చి..పిలిచిన..పటాకులు పేల్చినా …ఊసే లేదు ..అరుపు లేదు. ఇదేంట్రా ఇది ఇలా ఉంది అనుకుంటూ ఉండగానే ..ఆ అందరికి చూసి …మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తాను అని ..అలా అలా ఆ పని చేసేసింది ఆ అడవి జివి. అసలు ఎందుకు అడవిని వదిలి ..ఇండ్ల మధ్యలోకి వచ్చి ఇలా ఎందుకు చేసింది…

చిత్తూరులోని పలమనేరు మండలం బండమీద జరావారిపల్లి గ్రామంలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది. తమ ఇంట్లో రెడ్డప్ప కుటుంబం నిద్రిస్తున్న సమయంలో పైన రేకులను పెకలించి వేస్తున్న సౌండ్‌తో అప్రమత్తమై చూడగా ఒంటరి ఏనుగు కనిపించింది. దీంతో భయపడి నిద్రిస్తున్న వారి పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు..

Chittoor: ఇంటి గోడలు కూల్చి అక్కడున్నటువంటి రాగులు వరిని అరగించిందన్నారు. మేము కనుక అక్కడ నుంచి లేవకపోయి ఉంటే గోడ కూలి మా ప్రాణాలు పోయిండేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఒంటరి ఏనుగును తరమడానికి బాణా సంచా కాల్చిన, అరిచిన ఏమాత్రం కదలలేదని తెలిపారు.

అధికారులకు సమాచారం అందించామని, మాకు ఏనుగుల నుండి ప్రాణప్రాయం ఉందని, ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుకుమార్ మాట్లాడుతూ.. బండమీద జరావారిపల్లి గ్రామస్తుడు రెడ్డప్ప సమాచారం మేరకు ఘటన ప్రాంతానికి చేరుకుని మొత్తం పరిశీలించామన్నారు. బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *