women's T20 World Cup 2024

Women’s T20 World Cup 2024: మహిళల T20 వరల్డ్ కప్ ఈరోజు నుంచే.. షెడ్యూల్ ఇదే!

Women’s T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ ఈరోజు  నుంచి ప్రారంభం కానుంది. షార్జా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తదుపరి రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక మధ్య మరో మ్యాచ్ జరగనుంది. రేపటి (ఏప్రిల్ 4) నుంచి టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని టీమిండియా ప్రారంభించనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అలాగే అక్టోబర్ 6న భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది.

Women’s T20 World Cup 2024: అక్టోబరు 9న జరిగే మూడో మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. అలాగే అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో ఆడడం ద్వారా భారత జట్టు తన తొలి రౌండ్ మ్యాచ్‌లను పూర్తి చేస్తుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు. 

ఏ ఛానెల్‌లలో లైవ్ చూడొచ్చు అంటే.. 

మహిళల T20 ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో లైవ్ లో చూడొచ్చు. 

ఉచితంగా చూడటం ఎలా?

ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.

తేదీ

మ్యాచ్  సమయం వేదిక

దేశం

అక్టోబర్ 4, శుక్రవారం ఇండియా vs న్యూజిలాండ్ 7:30 p.m గ్రూప్ A దుబాయ్
అక్టోబర్ 6, ఆదివారం భారత్ vs పాకిస్థాన్ మధ్యాహ్నం 3:30 గ్రూప్ A దుబాయ్
అక్టోబర్ 9, బుధవారం భారత్ vs శ్రీలంక 7:30 p.m గ్రూప్ A దుబాయ్
అక్టోబర్ 13, ఆదివారం ఇండియా vs ఆస్ట్రేలియా 7:30 p.m గ్రూప్ A షార్జా
అక్టోబర్ 17, గురువారం అర్హత సాధించిన తర్వాత 7:30 p.m సెమీఫైనల్ 1 దుబాయ్
అక్టోబర్ 18, శుక్రవారం అర్హత సాధించిన తర్వాత 7:30 p.m సెమీఫైనల్ 2 షార్జా
అక్టోబర్ 20, ఆదివారం అర్హత సాధించిన తర్వాత 7:30 p.m ఫైనల్ దుబాయ్

మహిళల T20 ప్రపంచకప్ ఇప్పటివరకూ గెలిచిన వారు వీరే!

ఎడిషన్

విజేత గెలుపు మార్జిన్ రన్నరప్

హోస్ట్ దేశం

2009 ఇంగ్లండ్ 6 వికెట్లు న్యూజిలాండ్ ఇంగ్లండ్
2010 ఆస్ట్రేలియా 3 పరుగులు న్యూజిలాండ్ వెస్టిండీస్
2012 ఆస్ట్రేలియా 4 పరుగులు ఇంగ్లండ్ శ్రీలంక
2014 ఆస్ట్రేలియా 6 వికెట్లు ఇంగ్లండ్ బంగ్లాదేశ్
2016 వెస్టిండీస్ 8 వికెట్లు ఆస్ట్రేలియా భారతదేశం
2018 ఆస్ట్రేలియా 8 వికెట్లు ఇంగ్లండ్ వెస్టిండీస్
2020 ఆస్ట్రేలియా 85 పరుగులు భారతదేశం ఆస్ట్రేలియా
2023 ఆస్ట్రేలియా 19 పరుగులు దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా
ALSO READ  IND vs Ban T20: బంగ్లాను ఆడేసుకున్న నితీశ్, రింకూ.. రెండో ట్వంటీ20లో టీమిండియా సునాయాస విజయం

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *