hydra

Hydra: నాడు కనికరం లేకుండా హైడ్రా కూల్చివేతల జోరు..

Hydra: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, నాళాలు ఆక్రమణలకు గురివడంతో వాటిని తొలగించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, నాళాల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే బుల్డోజర్లతో అక్కడ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చి వేయడంతో ఒక్కసారిగా హైడ్రా పేరు మారు మోగిపోయింది.ఆ తర్వాత ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల పేరుతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతల టైమ్‌లో కనీసం సామానులు తీసుకునేందుకు సమయం ఇవ్వలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Jaishankar: స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు

ఆక్రమణ తొలగించే పేరుతో హైడ్రా దూకుడుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలతో పాటు చిరు వ్యాపారులకు సంబంధించిన భవనాలను కూల్చే టైమ్‌లో కనీసం సామానులు తీసుకునేందుకు సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చివేసింది. బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ హైడ్రా తీరుని ఎండగడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైడ్రా తీరుపై హైకోర్టు సైతం తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. అధికారులు చెప్తే చార్మినార్‌, హైకోర్టును కూడా కూల్చివేస్తారా అని హైడ్రా కమిషనర్‌ను హైకోర్డు ప్రశ్నించింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవ్వడం హైడ్రాకు ఉన్న అధికారాలను సైతం ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. దీంతో హైడ్రా కొంత వరకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Hydra: దీంతో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే… పూర్తిస్థాయి విచారణ చేపట్టి… నివాసం ఉండే భవనాలను కూల్చమని… అనుమతులు లేని వాటినే కూలుస్తామని అటు ప్రభుత్వం, ఇటు హైడ్రా కమిషనర్ ప్రకటించారు. మొత్తంగా మొదట్లో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా… నేడు ఆచితూచి అడుగులు వేస్తూ ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాకే కూల్చివేతలు చేపడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *