Jani Master

Jani Master: మళ్ళీ బిజీ అవుతున్న జానీ మాస్టర్!

Jani Master: అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు కారణంగా జైలు కెళ్ళి బెయిల్ పై విడుదల అయ్యారు జానీ మాస్టర్. జాతీయ స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎంపికైనా… దానిని అందుకునే అర్హతను ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ కోల్పోయాడు. అయితే బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు జానీ మాస్టర్. తాజాగా అతను హిందీ సినిమా ‘బేబీ జాన్’కు కొరియోగ్రఫీ చేశాడు. ఇటీవల విడుదలైన ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. అందులోని స్టెప్పులను సమకూర్చే క్రమంలో లేడీ కొరియోగ్రాఫర్ తో కలిసి జానీ మాస్టర్ స్టెప్పులేసిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పాట విడుదలకు ముందు చేసిందా… లేక తాజాగా చేసిందా అనేది తెలియదు కానీ ఈ పాటలో స్టెప్స్ కంపోజ్ కోసం జానీ మాస్టర్ పడిన తపన అందులో కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మరికొందరు నిర్మాతలు అతన్ని అప్రోచ్ అవుతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *