Phone tapping: విచారణకు సహకరించండి.. హరిష్ కు హై కోర్టు సూచన

Phone tapping: హరీశ్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీశ్‌ రావును అరెస్టు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అతని మీద ఉన్న కేసు గురించి దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. హరీశ్‌ రావు విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది.

అయితే, ఈ కేసులో ఆయన పై ఉన్న ఆరోపణలను కొట్టిపారేయడానికి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు చేసిన తర్వాత తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేసినట్లు హరిష్ రావు పేర్కొన్నారు.ఈ వ్యవహారం లో ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టును కోరిన హరీశ్ రావు, విచారణను వాయిదా వేసేందుకు విజ్ఞప్తి చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mega Parents-Teachers Meeting: నేడు ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్..రెండు కోట్ల పైగా జనంతో ఈవెంట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *