Hyderabad:

Hyderabad: సాగ‌ర్ జ‌లాల్లో విహ‌రించేద్దామా ఇలా!

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్‌లో రోజురోజుకూ ప‌ర్యాట‌క హంగులు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ సాగ‌ర్ జ‌లాల అందాల‌ను ఆస్వాదిస్తూ, ఆ జ‌లాల‌పై లాంచీల్లో విహ‌రిస్తూ, బోట్ల‌పై రైడ్ చేస్తూ నిత్యం వేలాది మంది ప‌ర్యాట‌కులు ఆనందం పంచుకుంటున్నారు. ఇలా ప‌ర్యాట‌కుల కోసం మ‌రికొన్ని జెట్‌ బోట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా వ‌చ్చిన‌ అత్యాధునిక జెట్ స్పీడ్ బోట్లు మ‌రింత ఆనందం పంచ‌నున్నాయి. ఈ మేర‌కు ఆ అధునాత‌న బోట్ల‌ను ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌టేల్ ర‌మేశ్‌రెడ్డి ప్రారంభించారు. వారు సాగ‌ర్ జ‌లాల్లో ఓ బోటును న‌డిపి అల‌రించారు.

Hyderabad: హుస్సేన్ సాగ‌ర్ జ‌ల్లాలో విహ‌రించేందుకు ప‌ర్యాట‌కుల కోసం రూ.28 ల‌క్ష‌ల విలువైన జెట్ స్కీ, జెట్ అటాక్‌, రోల‌ర్, క‌యాకింగ్ బోట్ల‌ను నూత‌నంగా అందుబాటులోకి తెచ్చారు. వీటిని అందుబాటులోకి తెచ్చిన‌ అమ‌రావ‌తి బోటింగ్ క్ల‌బ్ యాజ‌మాన్యాన్ని జూప‌ల్లి కృష్ణారావు, ప‌టేల్ ర‌మేశ్‌రెడ్డి అభినందించారు. ప‌ర్యాట‌కులను ప్రోత్స‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తుంద‌ని వారు భ‌రోసా ఇచ్చారు. రాష్ట్రంలో మ‌రిన్ని వాట‌ర్‌ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *