Harbhajan Singh: ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ఓ మెలిక పెట్టిన పాక్ క్రికెట్ బోర్డుకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తామంటూనే. భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లబోమని.. ఆ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలంటూ మెలిక పెట్టింది. దీంతో ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దని, ఇందులో తమకెలాంటి బాధ లేదంటూ భజ్జీ కౌంటర్ ఇచ్చాడు.
Harbhajan Singh: పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరుమొండి వైఖరిని వదిలేసి టోర్నమెంట్‌ను జరగనివ్వండి. మీరు దానిని ఆపలేరు. మలేసియా, శ్రీలంకతోపాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు భారత జట్టు అక్కడ పర్యటించదంటూ హర్భజన్ స్పష్టం చేశాడు.
