Singareni: భయపడాల్సిన అవసరం లేదు

Singareni : సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు వారు చెప్పడం జరిగిందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు. ఉదయం 7:20నిమిషంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని, రిక్టర్ స్కేల్ పై 5.3గా భూప్రకంపనలు నమోదయ్యాయని తెలిపారు. భూకంపం ప్రభావంపై హైదరాబాద్ ఎన్జీఆర్ఐ అధికారులతో మాట్లాడం జరిగిందన్నారు.

వారు భూకంప ప్రభావంపై మరింత అధ్యయనం చేస్తున్నారన్నారు. ముందు జాగ్రత్తగా ఓపైన్ మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీలు చేస్తున్నామన్నారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీఎం తెలిపారు. కాగా,తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది . ములుగు కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి . రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు . రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది . చాలా చోట్ల ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని తప్పుడు కూతలు కూసిన వదిలిపెట్టేదెలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *