Ananthapur: వెంగల్ తుఫాన్ కారణంగా ఏపీలో ఘోరం జరిగింది. అనంతపురం జిల్లాలో పాత మిద్దె కూలి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుందుర్ప మండలం రుద్రంపల్లిలో పాత కాలంలో కట్టిన మట్టి మిద్దె అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్నారు. కూలిన మిద్దె వారిపై పడటంతో అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య అని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికుల సాయంతో మృతులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.
