mahaa vamsi

Mahaa Vamsi Comment: పవన్ చెప్పిన అలీషా ..దేశం లోనే అతి పెద్ద క్రైమ్

Mahaa Vamsi Comment: రైస్ మాఫియా ఆగడాలను అడ్డుకునే క్రమంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు దగ్గర అక్కడి పరిస్థితులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రెండు మూడు సార్లు ఒక పేరును చెప్పడం జరిగింది. హూ ఈజ్ అలీషా అంటూ పవన్ కళ్యాణ్ అక్కడి అధికారులను అడగడం కనిపించింది. దీంతో అందరిలోనూ ఎవరీ అలీషా అనే ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే అలీషా అనే వ్యక్తి తన పేరును పవన్ చెప్పడంపై ఒక ప్రెస్ మీట్ లో రెచ్చిపోయారు. తన పేరును ఎవరైనా తప్పుగా చెబితే కోర్టుకు వెళతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అసలు అలీషా అనేవాడు ఎవరు? అనే ఆసక్తి మరింత పెరిగింది. అలీషా అనేవాడు మామూలోడు కాదు. ఈ మాట కూడా సరిపోదు. మనం ఎప్పుడూ ముంబయిలో మాఫియా గురించో.. అంతర్జాతీయంగా ఇల్లీగల్ రాకెట్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ, అవినీతి ప్రభుత్వాల నీడలో..  అధికారుల అండదండలతో చిల్లర దొంగగా జీవితం ప్రారంభించి మన పక్కనే విషం చిమ్ముతూ మాఫియా డాన్ గా ఎదిగిపోయిన పాములను గుర్తించలేం. ఇదిగో అలాంటి వాడే అలీషా. 

అలీషా.. సముద్రపు డాన్.. వందల కోట్లలో కంపెనీ లావాదేవీలు.. వేలకోట్ల సామ్రాజ్యం.. దేశ విదేశాల్లో కంపెనీలు.. వందల్లో నౌకలు ఇవన్నీ అతని గొప్పతనాన్ని చెప్పేవే. కానీ.. దీని కోసం అలీషా చేసే గలీజు పనులు అన్నీ.. ఇన్నీ కాదు. మూల పడ్డ నౌకలకు కూడా అక్రమాలు అనుమతులు తీసుకుని నడిపించడం దగ్గర నుంచి సముద్ర మార్గంలో బియ్యం నుంచి డ్రగ్స్ వరకూ అక్రమ రవాణాలో అతని పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయంగా సముద్రం మీద ఆయన చెప్తే ఏదైనా అవ్వాల్సిందే.. ఆయన చెప్పింది వేదం.. ఏ కస్టమ్స్ అధికారైన ఏ పోర్ట్ ఆఫీసు అయినా అలీషా మాట వినవలసిందే.. ఇది అలీషా డాన్ రేంజ్. 

ప్రజా ప్రతినిధులును గుప్పెట్లో పెట్టుకోవడంలో అలీషా దిట్ట. అసలు అలీషా జీవితం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న గుమస్తాగా పనిచేస్తూ అక్రమాల దారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడి అదే బాటలో ఇప్పుడు డాన్ గా అవతరించిన వ్యక్తి అలీషా. ఆయన అక్రమాలకూ సాక్ష్యం ఆయనపై నమోదు అయిన కేసులే. 

Mahaa Vamsi Comment: కృష్ణా, గోదావరి బేసిన్ సర్వే,ఆఫ్ షోర్, అన్ సార్, సర్వీసెస్ అందించే కార్యకలాపాల్లో కాకినాడ పోర్టు కేంద్రంగా అవినీతి, అక్రమాలు జరుగు తున్నాయి. మెరైన్ వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేస్తూ… నకిలీ పత్రాలతో చెలరేగి పోతూ… నానా ఇబ్బందులకు గురి చేస్తూ వారిని ఆర్ధికంగా దెబ్బతీస్తున్నఈ సముద్రపు డాన్ చేసి దందాలు అన్నీ ఇన్నీ కావు… పైపులకురంధ్రాలు వేసి పామాయిల్ దొంగతనంలో కీలక దొంగగా తెరపైకి వచ్చిన సన్ మెరైన్స్..సన్ మెరైన్స్ అధినేత  మహమ్మద్ ఆలీషా ప్రస్తుత ఎఫ్ఐఆర్ 415/17 దొంగతనం కేసులో ఎ2గా సర్పవరం పోలీసులతో అరెస్ట్ అయి  కాకినాడ సబ్ జైలులో ముద్దాయిగా వున్నారు.  మహమ్మద్ ఆలీషా సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి చాలీచాలని జీతానికి గుమస్తాగా నౌకలకు కిరాణా,ఇతర సామాన్లు అందించే కంపెనీలో చేరారు.

Mahaa Vamsi Comment: ఆయిల్ బంకరింగ్లో నైపుణ్యంతో ఎన్నో అక్రమాలకు ఒడిగట్టాడు. సుమారు 5 ఎఫ్ఐఆర్లు ఇతనిపై నమోదు అయ్యాయి. అయిల్ బంకరింగ్లో దొంగ డీజిల్తో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కాకినాడ కేంద్రంగా సముద్రాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇదీ అలీషా చరిత్రలో కొంత భాగం. చెప్పాలంటే చాలా వుంది. అలాంటి అలీషా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, మీడియాను ఛాలెంజ్ చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా చెలరేగిపోయిన ఈ మాఫియా డాన్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. ఒకటీ రెండూ కాదు అలీషా అక్రమాలు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అక్రమాలపై దర్యాప్తు చేస్తే.. అప్పుడు కథ వేరేలా ఉంటుంది. ఈయనకు జగన్ ప్రభుత్వం ఎంత కొమ్ము కాసిందంటే.. అసలు అనుమతులు లభించే అవకాశం లేని బోట్స్ ని అక్రమ పద్ధతుల్లో అనుమతులు తెచ్చుకుని.. వాటి ప్రారంభోత్సవాలకు వైసీపీ నాయకులూ హాజరు కావడం వరకూ ప్రతి దశలోనూ అతనికి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. 

ప్రస్తుతం అలీషా కనుసన్నల్లోనే కాకినాడ పోర్టు ఉంది అనేది నిజం అని స్థానిక ప్రజల దగ్గర నుంచి అక్కడి అధికారుల వరకూ చెబుతున్న మాట . సరైన దిశలో దర్యాప్తు చేస్తే అలీషా అక్రమాలన్నీ బయటపడతాయనేది వారందరి అభిప్రాయంగా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *