Narendra Modi

Narendra Modi: ప్రధాని అయ్యాక మోదీ చూసిన మొదటి సినిమా!

Narendra Modi: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూసిన మొదటి సినిమా ‘సబర్మతి రిపోర్ట్’ అని ప్రముఖ నటుడు జితేంద్ర తెలిపారు. ఈ సినిమా నిర్మాణంలో జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ సినిమాను ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ సహచరులు, ఎంపీల కోసం సోమవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించారు. మోదీతో పాటు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గట్కరీ, జితన్ రామ్ మంఝీ తదితరులు ఈ సినిమాను వీక్షించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జితేంద్ర, విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ఈ చిత్రాన్ని మోదీ బృందం చూడటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని విక్రాంత్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ అగ్నికి ఆహుతి అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న 59 మంది రామభక్తులు సజీవ దహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉన్న కుట్రను ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రంలో మేకర్స్ చూపించారు. ఈ సినిమా చూడకముందే వాస్తవాలను తెలియచేసే ఇలాంటి చిత్రాలను ప్రజలు ఆదరించాలంటూ మోదీ సోషల్ మీడియాలో ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Phone Tapping Case: కవిత, లోకేష్‌, సీబీఎన్‌.. ఎవ్వర్నీ వదల్లేదు!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *