Guntakandla Jagadish Reddy: ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి గుంతకండ్ల జగదశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పౌరసంఘాలు కోర్టుకెళ్లడంతో ఘటనపై విచారణ కొనసాగుతున్నది. మృతదేహాలను భద్రపర్చాలని ఆదేశించింది. ఈ దశలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో మరింత సంచలనం రేకెత్తుతున్నది.
Guntakandla Jagadish Reddy: ఏటూరునాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ ఘటనపై మాకు అనుమానాలు ఉన్నాయని గుంతకండ్ల జగదశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫేక్ ఎన్‌కౌంటర్లు ఎప్పటికైనా తప్పేనని చెప్పారు. గతంలో కేసీఆర్ ఏనాడూ ఎన్‌కౌంటర్లను ఒప్పుకోలేదని వివరించారు. ఇప్పుడేమో వరుస ఎన్‌కౌంటర్లు అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
Guntakandla Jagadish Reddy: తమ ఆదివాసీలను ఎక్కువగా చంపుతున్నారని, దీనిపైన తమకు అనుమానాలు ఉన్నాయని, ఘటనపై కోర్టులో ఫిర్యాదు చేసినట్టు ఆదివాసీ హక్కుల నేతలు తమకు రిప్రజంటేషన్ చేశారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్‌కౌంటర్ బూటకమైతే మాత్రం తప్పనిసరిగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 14 ఎన్‌కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. వాటిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా, వాటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉన్నదని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.