warangal: వరంగల్ నగరంలో పట్టపగలే ఓ వ్యక్తి హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని కారులో పెట్టడంతో నగరమంతా కలకలం సృష్టించిది. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి వెలుగట్టి రాజామోహన్‌గా గుర్తించారు. మంగళవారం అతన్ని చంపి కాళ్లకు తాళ్లు కట్టి హత్య చేసి, కారులో పెట్టి రోడ్డు పక్కన వదిలేసి దుండగులు పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
warangal: ఈ ఘటనలో వరంగల్, హనుమకొండ సిటీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత మూడు దశాబ్దాల క్రితం హత్యా ఘటనలతో నగరం అట్టుడికింది. కక్షా రాజకీయాలకు, రౌడీల దాడులకు, ముఠా తగాదాలకు ఎందరో బలయ్యారు. అయితే గత కొన్నాళ్లుగా సద్దుమణిగిన వైరాలు మళ్లీ వెలుగు చూడటంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.