KTR: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండటంతో తామేమి చేశామో అధికార పక్షం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే. ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. దీంతో ఇరు పక్షాల మధ్య పొలిటికల్ మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది.
ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్‌కు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘కొన్ని రోజుల పాటు వెల్నెస్ రి ట్రీట్‌కి వెళ్తున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా కోల్పోరని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీస్తున్నారు. అయితే ఇన్నాళ్లు మీటింగ్‌లు, ప్రెస్మీట్లు, సోషల్ మీడియాలో కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కేటీఆర్ ఆల్ఆఫ్సడెన్గా ఈ విరామం ప్రకటించడం వెనుక మతలబు ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: Jagan: ద్వారంపూడి దందా..అడ్డంగా జగన్..
KTR: బీఆర్ఎస్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం కొంత కాలంగా జోరుగా వినిపిస్తున్నది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌గా యాక్టివ్ కాగానే… కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. రాబోయే రోజుల్లో కవిత పార్టీలో ప్రధాన పాత్ర పోషించేలా గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ప్రణాళిలను సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కవిత బీసీ నినాదాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. బీసీ కార్డుతో కారు పార్టీ పాలిటిక్స్ చేయబోతున్నదనే వాదన వినిపిస్తుంది. త్వరలో పార్టీలో కీలక మార్పులు జరుగుతాయని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

