Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’ మూవీతో దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ సాధించాడు. అలానే అతను నటించిన మూడు సినిమాలు పీరియాడికల్సే! ఇక ఫస్ట్ టైమ్ దుల్కర్ ‘లక్కీ భాస్కర్’తోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా మిగిలిన రెండు సినిమాలకు గట్టి పోటీని ఇచ్చి… ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ నెల 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో ‘లక్కీ భాస్కర్’ స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంతేకాదు… దాదాపు 15 దేశాలలో టాప్ టెన్ జాబితాలో ఉంది. మొత్తం మీద సినిమాలో ‘లక్కీ భాస్కర్’ ఎలాగైతే చట్టానికి దొరక్కుండా లక్కీగా బయట పడ్డాడో… ఓటీటీలోనూ తన లక్ తో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

