Shobita sivanna; కన్నడ నటి హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకకు చెందిన సినీ నటి శోభిత శివన్న ఉరి వేసుకుని మృతిచెందింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డితో ఏడాదిన్నర క్రితం మ్యాట్రిమోనీలో శోభితకు పరిచయం అయింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ప్రస్తుతం కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని సీ బ్లాక్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం శోభిత నిద్రపోయింది.
సుధీర్‌రెడ్డి మరో గదిలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పనిమనిషి.. శోభిత గది తలుపు తట్టినా తీయకపోవడంతో విషయం సుధీర్‌కు చెప్పింది. ఆయన వచ్చి తట్టినా తీయకపోవడంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లారు. శోభత ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే విషయాన్ని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.