Ap news: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన పోక్సో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. నారాయణస్వామి, భూమన కరుణాకర్‌రెడ్డి సమక్షంలో.. బాలిక తల్లిదండ్రుల మీడియా సమావేశం నిర్వహించారు.బాలిక తండ్రి రమణ మాట్లడుతూ నేను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై తానెందుకు కేసు పెడతానని చెప్పారు. అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పోలీసులే సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి రమణ తెలిపారు.
కాగా, నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరిపైనా ఈ పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.