It’s Okay Guru: సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఇట్స్ ఓకే గురు’. చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటించిన ఈ సినిమాను మణికంఠ దర్శకత్వంలో సురేశ్ అనపువరపు, బస్వా గోవర్థన్ గౌడ్ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర ప్రసాద్ తో విడుదల చేయించారు. పోసర్ట్స్ తో పాటు మేకింగ్ విజువల్స్ చూసిన దామోదర ప్రసాద్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానియాక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
