Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్

జల్సాలకు, మద్యపానం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మహేశ్వరం డీసీపీ సునీత రెడ్ది మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలకొండపల్లి మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దుబ్బ హర్షవర్ధన్, (19) 29వ తేదీన వాహనాల తనిఖీలో పట్టు పడగా గ్రీన్ ఫార్మసిటీ పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారించారని తెలిపారు. నంది వనపర్తి గ్రామానికి చెందిన ఎడ్ల రాజు, (29) మహమ్మద్ ఆమెర్, (22) మేడిపల్లి గ్రామానికి చెందిన బేత జంగయ్య, (32) జాల నాగరాజు, (24) ముఠాగా ఏర్పడ్డారను విచారణలో తెలిసిందన్నారు.

దుబ్బ హర్షవర్ధన్, కు ద్విచక్ర వాహనాల చోరీలో అనుభవం ఉండడంతో అఫ్జల్ గంజ్, మహబూబ్ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం మంచాల ప్రాంతాలలో బస్టాండ్ రెస్టారెంట్లు ఇతర ప్రాంతాలలో మాస్టర్ కి తయారుచేసి పార్కింగ్ చేసిన 23 ద్విచక్ర వాహనాలను దొంగలించారని వెల్లడించారు.

కొన్ని రైతులకు విక్రయించగా మరికొన్ని వాహనాలు తమ ఇంటి వద్ద దాచిపెట్టినట్లు ఒప్పుకోవడంతో దొంగలించిన మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope Today: మీ ప్రయత్నాలకు కుటుంబమంతా తోడుంటుంది.. దూసుకుపొండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *