Pawan Kalyan

Pawan Kalyan: మంగళగిరిలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు మరియు మలిదశ పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏకగ్రీవాలు మినహా మిగిలిన 3,240 గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు (తొలి విడతలో ఇప్పటికే 709 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి).

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మొత్తం 31,614 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయగా, దాదాపు 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

మరోవైపు, పురపాలక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల (ఏపీఎస్పీ) ఎంఎస్ నగర్‌లోని 34వ డివిజన్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సాధారణ ఓటరులా క్యూలో నిలబడి ఓటు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *