Tirumala: తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, వచ్చే నెలలో జరగనున్న వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు వరుసగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ పది రోజుల్లో మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనుండగా, ఇందులో 92 శాతం ప్రాధాన్యత సామాన్య భక్తులకే ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
మొదటి 3 రోజులు (డిసెంబర్ 20, 21, 22) – ఎలక్ట్రానిక్ డిప్ (e-Dip) ద్వారా టోకెన్లు..
-
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: మొదటి 3 రోజుల దర్శనం కోసం ఆన్లైన్లో ఎస్ఎస్డీ (SSD) టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయిస్తారు. ఇందుకోసం నవంబర్ 27వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
-
డ్రా & కుటుంబ కోటా.. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ డ్రా తీసి టోకెన్లు మంజూరు చేస్తారు. ఒక దరఖాస్తులో గరిష్ఠంగా 4 మంది (1+3 కుటుంబ కోటా) భక్తులు నమోదు చేసుకోవచ్చు.
-
తొలి 3 రోజులు వీటికి బ్రేక్: డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లు మరియు ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
మిగిలిన 7 రోజులు (డిసెంబర్ 23 – 29) – టికెట్లు & సర్వదర్శనం వివరాలు..
| దర్శనం రకం | టికెట్ల విడుదల తేదీ & సమయం | రోజువారీ కోటా / నిబంధనలు |
| శ్రీవాణి దర్శనం టికెట్లు | డిసెంబర్ 5, ఉదయం 10:00 గంటలకు | రోజుకు 1,000 టికెట్లు (డిసెంబర్ 23 – 29 తేదీలకు) |
| రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం | డిసెంబర్ 5, మధ్యాహ్నం 3:00 గంటలకు | రోజుకు 15,000 టికెట్లు (డిసెంబర్ 23 – 29 తేదీలకు) |
| ఉచిత సర్వదర్శనం | ముందస్తు టోకెన్లు అవసరం లేదు | డిసెంబర్ 23 నుంచి 29 వరకు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతిస్తారు. |
భక్తులకు ముఖ్య గమనిక:
