బీఆర్ఎస్ నాయకుల పై పై విమర్శలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేసేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి దేశమంతా తెలుసని అన్నారు. మూసీలో ఆక్రమణల వల్ల అందరికీ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
గత ఐదేళ్లలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని అన్నారు. బడా నేతలు భవనాలు కట్టి.. ఆ భవనాలను పేదలకు అద్దెకు ఇచ్చారని ఆరోపించారు.
కొందరు చెరువుల మధ్యలో భవనాలు నిర్మించారని అన్నారు. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ స్థిర నివాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
