TG Inter Exams Time Table 2027: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్, ఒకేషనల్) విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2027 ఫిబ్రవరి/మార్చి నెలల్లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE) తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను బోర్డు కార్యదర్శి శ్రీమతి అభిలాష అభినవ్ (IAS) గురువారం (నవంబర్ 19, 2026) విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్టియర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24, 2027న ప్రారంభమై మార్చి 19న ముగియనుండగా, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25, 2027న మొదలై మార్చి 20న పూర్తవుతాయి.
ఇంటర్నల్స్, ఎథిక్స్ & ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ (2027)
థియరీ పరీక్షల కంటే ముందే ఇంటర్నల్ అసెస్‌మెంట్, ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు..
-
ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్: 2027 జనవరి 20 నుంచి జనవరి 25 వరకు నిర్వహిస్తారు.
-
పర్యావరణ విద్య (Environmental Education): 2027 జనవరి 27 (బుధవారం) ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు.
-
ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్: 2027 జనవరి 29 (శుక్రవారం) ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు.
-
ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు: ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 29, 2027న, సెకండియర్ విద్యార్థులకు జనవరి 30, 2027న జరుగుతాయి.
-
సెకండియర్ సైన్స్ ప్రాక్టికల్స్: 2027 ఫిబ్రవరి 1 (సోమవారం) నుంచి ఫిబ్రవరి 10 (బుధవారం) వరకు (ఆదివారాలతో సహా) రెండు సెషన్లలో నిర్వహిస్తారు. (మొదటి సెషన్: ఉదయం 9:00 – మధ్యాహ్నం 12:00; రెండో సెషన్: మధ్యాహ్నం 2:00 – సాయంత్రం 5:00).
-
ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ (కొత్త విధానం): 2027 ఫిబ్రవరి 11 (గురువారం) నుంచి ఫిబ్రవరి 18 (గురువారం) వరకు (ఆదివారంతో సహా) మూడు సెషన్లలో (ప్రతి సెషన్ 2 గంటలు) నిర్వహిస్తారు. (సెషన్-1: ఉదయం 9:00 – 11:00; సెషన్-2: మధ్యాహ్నం 12:00 – 2:00; సెషన్-3: మధ్యాహ్నం 3:30 – సాయంత్రం 5:30).
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ టైమ్‌టేబుల్ – 2027 (ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు)
| తేదీ & వారం | సబ్జెక్టుల వివరాలు |
| 24-02-2027 (బుధవారం) |
పార్ట్-II: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
|
| 26-02-2027 (శుక్రవారం) |
పార్ట్-I: ఇంగ్లీష్ పేపర్-I
|
| 02-03-2027 (మంగళవారం) |
పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I, అకౌంటెన్సీ పేపర్-I (ACE గ్రూప్ వారికి)
|
| 05-03-2027 (శుక్రవారం) |
పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I, కామర్స్ పేపర్-I (ACE గ్రూప్ వారికి)
|
| 09-03-2027 (మంగళవారం) |
ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
|
| 15-03-2027 (సోమవారం) |
కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-I
|
| 17-03-2027 (బుధవారం) |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, మ్యాథమెటిక్స్ పేపర్-I (MEC గ్రూప్ సింగిల్ పేపర్)
|
| 19-03-2027 (శుక్రవారం) |
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I, జాగ్రఫీ పేపర్-I, బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్-I (న్యూ & ఓల్డ్ పేపర్ – BiPC విద్యార్థుల కోసం)
|
తెలంగాణ ఇంటర్ సెకండియర్ టైమ్‌టేబుల్ – 2027 (ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు)
| తేదీ & వారం | సబ్జెక్టుల వివరాలు |
| 25-02-2027 (గురువారం) |
పార్ట్-II: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
|
| 27-02-2027 (శనివారం) |
పార్ట్-I: ఇంగ్లీష్ పేపర్-II
|
| 03-03-2027 (బుధవారం) |
పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
|
| 08-03-2027 (సోమవారం) |
పార్ట్-III: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
|
| 12-03-2027 (శుక్రవారం) |
ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
|
| 16-03-2027 (మంగళవారం) |
కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-II
|
| 18-03-2027 (గురువారం) |
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II
|
| 20-03-2027 (శనివారం) |
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II, బ్రిడ్జ్ కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్-II (BiPC విద్యార్థుల కోసం)
|
