Sreeleela: వరుస సినిమాలతో టాలీవుడ్‌లో ఒకప్పుడు ఊపిరి సలపనంత బిజీగా గడిపిన యంగ్ బ్యూటీ శ్రీలీల, గత కొంతకాలంగా తెలుగు తెరపై పెద్దగా కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాను టాలీవుడ్‌కు దూరం కాలేదని, తన చదువు పూర్తి చేసేందుకే కొత్త సినిమాలకు గ్యాప్ ఇచ్చానని శ్రీలీల స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓం’ (O.M: ఆపరేషన్ మోల్) సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న ఆమె, తన గ్యాప్ ఇంకా కెరీర్ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.. శ్రీలీల
ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చిందని శ్రీలీల తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో తాను ప్రత్యక్షంగా హాజరుకావడం తప్పనిసరి కావడంతో, కొత్త సినిమాల షూటింగ్‌లకు సమయం కేటాయించలేకపోయానని వివరించింది. ఆ సమయంలో కేవలం ‘ఓం’ సినిమాకు మాత్రమే సంతకం చేశానని, మెడిసిన్ పూర్తి చేయడం తప్ప టాలీవుడ్‌కు దూరంగా ఉండటానికి మరే ఇతర కారణాలు లేవని తేల్చిచెప్పింది.
తొలిరోజుల్లో సినిమాల ఎంపికలో నాకు స్వేచ్ఛ ఉండేది కాదు!
