PM Modi: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం (నవంబర్ 19, 2026) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి (Council of Ministers) సుదీర్ఘ సమావేశం జరిగింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక క్రమశిక్షణ, పేదరిక నిర్మూలన, యువత భవిష్యత్తు మరియు అంతర్గత భద్రతపై మంత్రులకు కీలక సూచనలు చేశారు. “ఖావో, పీయో, మౌజ్ కరో” (తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి) అనే ధోరణి భారత సంస్కృతి కాదని, పొదుపు మరియు ఆర్థిక క్రమశిక్షణతోనే దేశ ప్రగతి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
పొదుపు అలవాటు లేకపోతే మళ్లీ పేదరికంలోకి వెళ్లే ప్రమాదం!.. ప్రధాని హెచ్చరిక
-
50 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు: 2011 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ దాదాపు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక విజయమని, ఇది దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాల్సిన ఘనత అని ప్రధాని కొనియాడారు.
-
ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి: అయితే, ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఒక ఎత్తయితే, వారు మళ్లీ పేదరికంలోకి జారిపోకుండా కాపాడుకోవడం అసలైన సవాలని మోదీ హెచ్చరించారు. ప్రజల్లో పొదుపు (Savings) అలవాటును ప్రోత్సహించకపోతే, మంత్రులు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఇప్పటివరకు సాధించిన ప్రగతి వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.
-
పేదలకు అంకితమైన ప్రభుత్వం: 2014లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తాను చేసిన తొలి ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న మోదీ.. తమ ప్రభుత్వం మొదటి నుంచీ పేదల సంక్షేమానికే అంకితమై పనిచేస్తోందని తెలిపారు.
డ్రగ్స్ మహమ్మారిపై ప్రధాని భావోద్వేగం – నక్సలిజం తరహాలోనే అంతం చేయాలి!
-
బొంగురుపోయిన గొంతుతో పిలుపు: దేశ యువత డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెబుతూ ప్రధాని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
-
నక్సలిజం మళ్లీ తలెత్తకుండా అప్రమత్తత: దేశం నక్సలిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నట్లే, డ్రగ్స్ సమస్యను కూడా పూర్తిగా అంతం చేయగలదని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, నక్సలిజం తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండవద్దని, అది మళ్లీ తలెత్తకుండా మంత్రులు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలపై సమీక్ష
