Y. S. Sharmila: సాక్షి పత్రికపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల: “తండ్రి వయసున్న వ్యక్తికి పెళ్లి పత్రిక ఇస్తే ‘ఆత్మీయ సంబంధాలు’ అంటగడతారా?.. మనిషై పుట్టినవారు ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేస్తారా?” వైఎస్ జగన్ సంజాయిషీ ఇవ్వాలంటూ ఎక్స్ (X) వేదికగా షర్మిల తీవ్ర ఆగ్రహం!
ఆడబిడ్డపై ఇలాంటి వ్యక్తిత్వ హననం చేస్తారా?.. – షర్మిల ఫైర్!
-
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే తప్పుడు అర్థాలా?: “తండ్రి వయసున్న వ్యక్తికి నా కుమార్తె పెళ్లి శుభలేఖ అందిస్తే ‘చెట్టాపట్టాలు, ఆత్మీయ సంబంధాలు’ అంటూ తప్పుడు అర్థాలు ఆపాదిస్తారా? మనిషై పుట్టినవారు ఒక ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేస్తారా? సమాజం పట్ల విలువలు ఉన్నవారు ఇలాంటి రాతలు రాస్తారా?” అని షర్మిల నిలదీశారు.
-
కుటుంబంపై వ్యక్తిత్వ హననం: ఇది తనపై, తన కుటుంబంపై జరిగిన అత్యంత నీచమైన వ్యక్తిత్వ హననమని ఆమె అభివర్ణించారు.
వైఎస్ జగన్కు సూటి ప్రశ్నలు.. నాడు వైఎస్సార్ కూడా చంద్రబాబును పిలిచారు కదా!
ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను షర్మిల నేరుగా టార్గెట్ చేశారు:
-
తల్లి, చెల్లి అనే తేడా లేకుండా బురదజల్లుతారా?: “మహిళల పట్ల అమితమైన ప్రేమ, గౌరవం ఉందని చెప్పుకునే వైఎస్ జగన్ గారు.. మీ సొంత పత్రికలో ఒక మహిళపై ఇలాంటి అసభ్యకర కథనాలను ఎలా సమర్థించుకుంటారు? తల్లి, చెల్లి అనే తేడా లేకుండా బురదజల్లే రాతలు రాయించడమే మీ ఎజెండానా?” అని మండిపడ్డారు.
-
వైఎస్సార్ నాటి విషయాన్ని గుర్తుచేస్తూ..: గతంలో తన పిల్లల వివాహ వేడుకలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం చంద్రబాబు నాయుడును ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. “అప్పుడు వైఎస్సార్ గారు కూడా చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకున్నట్లేనా? పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదిస్తే సన్నిహిత సంబంధాలు ఉన్నట్లా?” అని ప్రశ్నించారు.
-
జగన్ సంజాయిషీ ఇస్తారా?: ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారో చెప్పాలని, దీనిపై వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని, లేదంటే సాక్షి పత్రికతో బహిరంగ వివరణ ఇప్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
— YS Sharmila (@realyssharmila) November 17, 2026
