Sheikh Hasina: రెండేళ్లకు పైగా భారతదేశంలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారా? డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ఇటీవల హసీనా ప్రకటించడం అటు ఢాకాలో, ఇటు న్యూఢిల్లీలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, హసీనాను పంపే విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది! ఆమె ప్రాణాలకు భద్రత, న్యాయపరమైన హక్కుల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు వస్తేనే ఆమెను పంపేందుకు భారత్ సుముఖంగా ఉందని బీబీసీ బంగ్లా (BBC Bangla) తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది. ఇంతకీ భారత్ పెట్టిన ఆ రెండు కీలక షరతులు ఏంటి? తెరవెనుక ఏం జరుగుతోంది? సింపుల్‌గా తెలుసుకుందాం!
హసీనా తిరుగు ప్రయాణానికి భారత్ పెట్టిన 2 ప్రధాన షరతులు..
తెరవెనుక సైనిక అధికారుల చర్చలు & పాస్‌పోర్ట్ ట్విస్ట్!
-
సైనిక చర్చలు: హసీనా తిరుగు ప్రయాణంపై భారత్, బంగ్లాదేశ్ మధ్య కొంతకాలంగా తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అక్టోబర్ 6న బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్తో భేటీ అయ్యారని బీబీసీ కథనం తెలిపింది.
-
పాస్‌పోర్ట్ కోసం హసీనా దరఖాస్తు: నవంబర్ 9న షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రవాసంలోకి వెళ్లిన తర్వాత ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అధికారికంగా సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. దీని ద్వారా హసీనా బంతిని బంగ్లాదేశ్ ప్రభుత్వ కోర్టులోకి నెట్టారని విశ్లేషకులు అంటున్నారు.
డిసెంబర్లో హసీనా ఢాకా వెళ్లడం అంత ఈజీనా?
