Rahul Gandhi

Rahul Gandhi: హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీ.. పాల్గొన్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి.. !

Rahul Gandhi: హైదరాబాద్ నగరంలో గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు) నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ‘కొత్త ప్రపంచ నిర్మాణం’ పేరిట నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ సదస్సులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు విచ్చేశారు.

ఈ పర్యటనలో భాగంగా శిల్పారామం (శిల్పకళా వేదిక) నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జయభేరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకుని రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాన్ని నాయకులు ప్రారంభించనున్నారు. మరోవైపు, ఈ భారీ బైక్ ర్యాలీ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సైబరాబాద్ పోలీసులు హైటెక్ సిటీ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *