NBTNTR Charitable Trust

NBTNTR Charitable Trust: శిశు మంగల్ అనాధ ఆశ్రమంలో నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి దీపావళి కానుకలు

NBTNTR Charitable Trust: దీపావళి సందర్భంగా శిశు మంగల్ అనాధ ఆశ్రమంలోని పిల్లలకు దీపావళి కానుకలు అందజేసిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్.. పుణ్య దంపతులు శ్రీ నందమూరి తారక రామారావు, శ్రీమతి నందమూరి బసవ నామ తారకం గారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తూ ప్రారంభించిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి దీపావళి పండుగ సందర్భంగా తెల్లాపూర్ లోని శిశు మంగళ్ అనాధ ఆశ్రమానికి దీపావళి కానుకలు అందజేయడం జరిగింది.

తెల్లాపూర్ లో ఉన్న ఈ అనాధాశ్రమంలోని బాల బాలికలకు దీపావళి సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నందమూరి మోహన కృష్ణ గారి ఆధ్వర్యంలో మేనేజింగ్ ట్రస్టీ నందమూరి మోహన రూప గారు, బోర్డు ట్రస్టీ నందమూరి సీమంతిని గారు కలిసి ఈ అనాధాశ్రమాన్ని చేరుకుని అక్కడ పిల్లలతో ముందుగా కాసేపు ముచ్చటించారు.

అలాగే వారందరితో కలిసి మూడు గంటలకు పైగా సమయాన్ని గడుపుతూనే జై బాలయ్య నినాదాలతో దబిడి పాటకు డాన్స్ చేస్తూ నవ్వులతో తమ సమయాన్ని గడిపారు. 2012లో శ్రీనివాస్ గారు వృత్తిపరంగా యోగ నేర్పించే ఆయన తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల కోసం ప్రారంభించిన ఈ అనాధాశ్రమం ఎంతోమంది పిల్లలకు నిర్వహిస్తుంది. ఆశ్రమంలోని పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అలాగే వారందరికీ నూతన వస్త్రాలు, మిఠాయిలు అందజేసి దీపావళి సందర్భంగా వారికి టపాసులను బహుకరించి వారిని మరింత ఆనందింపజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *