nara lokesh

Nara Lokesh: రాప్తాడు దాడి బాధితురాలు ఆరోగ్యంపై మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్

Nara Lokesh: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది చేతిలో పవర్ చైన్‌సా దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి క్రమంగా కోలుకుంటోందని, పరిస్థితి మెరుగ్గా ఉందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

శనివారం ఉదయం 8:30 గంటల సమయానికి వైద్యులు అందించిన తాజా వివరాలను లోకేశ్ పంచుకున్నారు. గోపిక ప్రస్తుతం స్పృహతో, ఆరోగ్యంగా ఉందని తెలిపారు. వైద్యుల సమక్షంలో ఇవాళ ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోగలిగిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు లిక్విడ్ డైట్‌పై ఉన్న ఆ చిన్నారికి వైద్యులు శనివారం నుంచి ఘన ఆహారాన్ని (Solid diet) అందించడం ప్రారంభించారని చెప్పారు.
అంతేకాకుండా, ఇవాళ ఆమె చేత కొన్ని అడుగులు నడిపించేందుకు వైద్య బృందం సన్నాహాలు చేస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం నుంచి బయటపడి గోపిక వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ నిరంతరం ప్రార్థనలు చేసిన, ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మంత్రి లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *