PM Kisan: దీపావళి పండుగ వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చాలా రోజులుగా అన్నదాతలు ఎదురుచూస్తున్న ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-KISAN) 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా విడుదల చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్డీ వేదికగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్ల మంది (93.4 మిలియన్లు) రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ. 18,680 కోట్లు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా బదిలీ అయ్యాయి.
అయితే, పండుగ వేళ డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అనర్హత, ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్, భూ రికార్డుల సరిపోలిక లేకపోవడం వల్ల ఈసారి దేశవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమనార్హం.
ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం
పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? మొబైల్లోనే స్టేటస్ ఇలా తెలుసుకోండి..
మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని మీ ఫోన్ ద్వారా ‘నో యువర్ స్టేటస్’ (Know Your Status) ద్వారా క్షణాల్లో చెక్ చేసుకోవచ్చు..
-
ముందుగా అధికారిక పోర్టల్ pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
-
హోమ్‌పేజీలో కుడివైపున కనిపించే ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
-
అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) ఎంటర్ చేసి, స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
-
ఆ తర్వాత ‘Get OTP’ పై క్లిక్ చేస్తే.. మీ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
-
ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీ పేమెంట్ స్టేటస్, 24వ విడత డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయనే పూర్తి వివరాలు కనిపిస్తాయి.
(ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే.. అదే పేజీలో పైన ఉన్న ‘Know your registration number’ పై క్లిక్ చేసి, ఆధార్ లేదా మొబైల్ నంబర్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు.)
గ్రామ లబ్ధిదారుల జాబితా (Beneficiary List) లో మీ పేరు చెక్ చేయడం ఎలా?
మీ గ్రామంలోని అర్హులైన రైతుల జాబితాలో మీ పేరు యాక్టివ్‌గా ఉందో లేదో చూడటానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
-
అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లోకి వెళ్లండి.
-
హోమ్‌పేజీలో ‘Beneficiary List’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
-
స్క్రీన్ పై మీ వివరాలు అడుగుతుంది:
-
రాష్ట్రం (State)
-
జిల్లా (District)
-
ఉప జిల్లా / మండలం (Sub-District)
-
బ్లాక్ (Block)
-
గ్రామం (Village) సెలెక్ట్ చేసుకోండి.
-
-
వివరాలన్నీ ఎంపిక చేసుకున్న తర్వాత ‘Get Report’ పై క్లిక్ చేయండి.
-
వెంటనే మీ ఊరి మొత్తం రైతుల పేర్ల లిస్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటే మీకు ఈ విడత సాయం అందినట్లే.
జాబితాలో పేరు లేకపోయినా లేదా డబ్బులు రాకపోయినా.. ఆధార్-బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ ప్రక్రియను సమీపంలోని మీ-సేవా లేదా సీఎస్సీ (CSC) కేంద్రాల్లో వెంటనే సరిచూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
