Ramayana

Ramayana: ‘పే-పర్-వ్యూ’ మోడల్ లో ‘రామాయణ’ విడుదల?.. పైరసీ ముప్పు తప్పదా!

Ramayana: బిగ్గెస్ట్ క్యాస్టింగ్ అలాగే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ ఓటీటీ విడుదలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమాని ‘పే-పర్-వ్యూ’ (Pay-per-view) విధానంలో తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో భాగంగా సినిమాలు అందుబాటులోకి రావడం చూస్తుంటాం. అయితే ‘పే-పర్-వ్యూ’ మోడల్‌లో సినిమా చూడాలంటే ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అదనపు రుసుము(డబ్బులు) చెల్లించాల్సి ఉంటుంది. మూవీ టీమ్ అదనపు ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనగా ఇది కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ విధానానికి పెద్ద సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ విధానంలో ప్రధాన సమస్య పైరసీ ముప్పు. భారీ వ్యయంతో కూడిన భారతీయ సినిమాలకు పైరసీ ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా మారుతోంది. పే-పర్-వ్యూ కోసం నిర్ణయించే ధర ఎక్కువగా ఉంటే, సాధారణ ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అంత మొత్తం వెచ్చించడానికి వెనుకాడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చే ఉచిత పైరసీ కాపీల వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీ కాపీలు లీక్ అయితే, అది సినిమా డిజిటల్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఈ పే-పర్-వ్యూ విధానం విజయవంతం కావాలంటే నిర్మాతలు టికెట్ ధరను సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించాల్సి ఉంటుంది. వ్యయం ఎక్కువగా అనిపిస్తే, సదరు సినిమాని  సాధారణ సబ్‌స్క్రిప్షన్ పరిధిలోకి వచ్చేవరకు లేదా పైరసీ రూపంలో దొరికే వరకు ప్రేక్షకులు వేచి చూసే ధోరణి కనిపించవచ్చు. ‘రామాయణ’ వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాకి ఉన్న విశేష అభిమానుల బలం ఈ చెల్లింపు విధానాన్ని ఎంతవరకు ఆదరిస్తుందో, పైరసీ అడ్డంకిని నిర్మాతలు ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *