AP Inter Exams 2027

AP Inter Exams 2027: ఫిబ్రవరి 24 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్.. పూర్తి టైంటేబుల్ ఇదే!

AP Inter Exams 2027: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (మార్చి-2027) తాత్కాలిక షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ,సెకౌండ్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ తోపాటు బ్యాక్‌లాగ్ విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఐఏఎస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఫిబ్రవరి 25న సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ కోర్సుల వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు (ఆదివారాలతో సహా) రెండు సెషన్లలో (ఉదయం 9:00 నుండి 12:00 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు) ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జనవరి 27న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 29న ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి కాలపట్టిక (Time Table):
  • ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
తేదీ సంవత్సరం పేపర్ / సబ్జెక్టు వివరాలు
24-02-2027 (బుధవారం) 1st Year
సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I (తెలుగు, సంస్కృతం, హిందీ తదితర భాషలు / ఎలెక్టివ్స్)
25-02-2027 (గురువారం) 2nd Year
సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II (తెలుగు, సంస్కృతం, హిందీ తదితర భాషలు / ఎలెక్టివ్స్)
26-02-2027 (శుక్రవారం) 1st Year
ఇంగ్లీష్ పేపర్-I
27-02-2027 (శనివారం) 2nd Year
ఇంగ్లీష్ పేపర్-II
01-03-2027 (సోమవారం) 1st Year
మ్యాథ్స్ / సివిక్స్ పేపర్-I (పాత విద్యార్థులకు మ్యాథ్స్-IA / బోటనీ / సివిక్స్)
02-03-2027 (మంగళవారం) 2nd Year
మ్యాథ్స్ / సివిక్స్ పేపర్-II (పాత విద్యార్థులకు మ్యాథ్స్-IIA / బోటనీ / సివిక్స్)
03-03-2027 (బుధవారం) 1st Year
బయాలజీ / హిస్టరీ పేపర్-I (పాత విద్యార్థులకు మ్యాథ్స్-IB / జువాలజీ / హిస్టరీ)
04-03-2027 (గురువారం) 2nd Year
బయాలజీ / హిస్టరీ పేపర్-II (పాత విద్యార్థులకు మ్యాథ్స్-IIB / జువాలజీ / హిస్టరీ)
05-03-2027 (శుక్రవారం) 1st Year
ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-I
08-03-2027 (సోమవారం) 2nd Year
ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-II
09-03-2027 (మంగళవారం) 1st Year
కెమిస్ట్రీ / కామర్స్ పేపర్-I
11-03-2027 (గురువారం) 2nd Year
కెమిస్ట్రీ / కామర్స్ పేపర్-II
12-03-2027 (శుక్రవారం) 1st Year
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
13-03-2027 (శనివారం) 2nd Year
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
15-03-2027 (సోమవారం) 1st Year
మోడరన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-I
16-03-2027 (మంగళవారం) 2nd Year
మోడరన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-II

126191560-file

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *