The Paradise: బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ వచ్చినా సరే.. కొన్ని సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని మూవీ లవర్స్, నెటిజన్లు తెగ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మోస్ట్ డిబేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది. గత నెల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొందరు సినిమాలోని రా అండ్ రస్టిక్ మేకింగ్‌ను నెత్తిన పెట్టుకుంటే.. మరికొందరు మాత్రం విపరీతమైన వయోలెన్స్, కంటెంట్ సరిగ్గా లేదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు.
థియేటర్లలో చూడలేకపోయిన సినీ ప్రియులు.. అసలు ఈ సినిమాకు ఇంత కాంట్రాస్ట్ రియాక్షన్స్ ఎందుకు వచ్చాయో చూద్దామని ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా ‘ది ప్యారడైజ్’ సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇక అంతే.. సినిమా స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో సినిమా పేరు మళ్లీ టాప్ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది.
ఓటీటీలోనూ తప్పని ట్రోల్స్ – నాని, శ్రీకాంత్‌లపై మళ్లీ నెగెటివ్ వేవ్?..
థియేటర్లలో వచ్చిన చేదు అనుభవం తర్వాత.. ఓటీటీ ఆడియన్స్ సినిమాను పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారని మూవీ టీమ్ ఆశించింది. కానీ మార్నింగ్ నుంచే సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ చూస్తే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇద్దరినీ నెటిజన్లు మరోసారి గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో లాజిక్ లెస్ సీన్లు, ఓవర్ ది టాప్ రక్తపాతంపై మీమర్స్ ఒక రేంజిలో విరుచుకుపడుతున్నారు.
డైరెక్టర్‌పై తీవ్ర విమర్శలు..
‘దసరా’ లాంటి నేషనల్ లెవెల్ హిట్ తర్వాత నానితో శ్రీకాంత్ ఓదెల ఇలాంటి ప్రయోగం చేయడం ఏంటని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ వర్సెస్ ఓటీటీ: డిజిటల్ వెర్షన్లో జరిగిన మార్పులేంటి?
సినిమా థియేట్రికల్ వెర్షన్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు డిజిటల్ కట్లో కొన్ని కీలక మార్పులు చేశారు. అయితే ముందే అనుకున్నట్లు సినిమాను 25 నిమిషాల దాకా కట్ చేసేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. డిజిటల్ వెర్షన్ కూడా థియేటర్లలో మాదిరిగానే సరిగ్గా 2 గంటల 50 నిమిషాల నిడివితోనే స్ట్రీమ్ అవుతోంది. అయితే సీన్లలో మాత్రం కొన్ని ముఖ్యమైన కట్స్, ట్వీక్స్ జరిగాయి.
-
ధూమావతి ఫైట్ కట్స్..థియేటర్లలో ఆడియన్స్‌కు విపరీతమైన చిరాకు తెప్పించి, ట్రోలింగ్‌కు గురైన ‘ధూమావతి ఫైట్’ సీక్వెన్స్‌లో టీమ్ కత్తెర వేసింది. సినిమాలో తీవ్ర వెటకారంగా, కథకు సంబంధం లేకుండా అనిపించిన హీరో తల్లి డ్యాన్స్ సీక్వెన్స్‌ను డిజిటల్ వెర్షన్ నుంచి పూర్తిగా తొలగించారు.
-
వయోలెన్స్ డోస్ తగ్గింపు & సీజీఐ మెరుగుదల..విపరీతమైన రక్తపాతం ఉన్న కొన్ని సీన్ల నిడివిని తగ్గించారు. అంతేకాకుండా విమర్శలపాలైన గ్రాఫిక్స్ (VFX) వర్క్‌ను కాస్త రీ-వర్క్ చేసి క్వాలిటీ బెటర్ చేసే ప్రయత్నం చేశారు.
-
రోలింగ్ టైటిల్స్ స్పీడ్ కంట్రోల్:సినిమా కోసం ఎంతోమంది టెక్నీషియన్లు కష్టపడితే.. చివర్లో ఎండ్ క్రెడిట్స్ (రోలింగ్ టైటిల్స్) రాకెట్ స్పీడ్‌లో స్క్రోల్ అవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డిజిటల్ వెర్షన్లో ఆ టైటిల్స్ స్పీడ్ తగ్గించి పేర్లు కనిపించేలా సెట్ చేశారు.
హైప్ వల్ల వచ్చిన తంటా.. ట్రైలర్ లేకుండానే రిలీజ్!..
‘ది ప్యారడైజ్’ మూవీ అనౌన్స్ అయిన నాటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ఎలాగైనా నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే పట్టుదలతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను రెండుసార్లు వాయిదా వేశారు. దాదాపు రెండేళ్లకు పైగా టైమ్ తీసుకున్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కనీసం సినిమా ఎలా ఉండబోతోంది, కథేంటి అనే బేసిక్ ఐడియా కూడా ఆడియన్స్‌కు ఇవ్వకుండా.. కనీసం థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే సినిమాను థియేటర్లలోకి దించేశారు. దీంతో డైరెక్ట్‌గా థియేటర్లలోకి వెళ్లిన జనాలకు ఆ విపరీతమైన హింస, కన్ఫ్యూజింగ్ నేరేషన్ అస్సలు ఎక్కలేదు. ఒక్క కేసీఆర్ (KCR) రెఫరెన్స్ సీన్లకు మాత్రమే థియేటర్లలో మాస్ రెస్పాన్స్ రాగా, మిగిలిన సినిమాపై నెగెటివ్ టాక్ ముంచెత్తింది.
ప్రామిస్ మిస్సయింది.. తెలంగాణ సినిమాలో ఇంకా ఇంగ్లీష్ సాంగేనా?:
సినిమా రిలీజ్ తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఆలోచనలను అర్థం చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ తెరపై ఆ కంటెంట్ స్పష్టంగా లేకపోవడంతో ప్రేక్షకులు దాన్ని కనెక్ట్ చేసుకోలేకపోయారు.
అన్నింటికంటే ముఖ్యంగా.. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమాలో అసందర్భంగా ఇంగ్లీష్ సాంగ్ రావడంపై పెద్ద దుమారమే రేగింది. దీనిపై అప్పట్లో శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇస్తూ..
“అక్కడ తెలంగాణ ఫోక్ సాంగ్ రావాల్సింది. లిరిక్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ రిలీజ్ సమయానికి టైమ్ సరిపోక ఇంగ్లీష్ ట్రాక్ పెట్టాల్సి వచ్చింది. ఓటీటీ వెర్షన్ వచ్చేసరికి కచ్చితంగా దాన్ని ఒరిజినల్ తెలంగాణ పాటతో రీప్లేస్ చేస్తాం” అని హామీ ఇచ్చారు.
కానీ నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన డిజిటల్ వెర్షన్లో చూస్తే.. ఆ ఇంగ్లీష్ పాటే అలాగే కొనసాగింది. దర్శకుడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ పాటను యాడ్ చేయకపోవడంపై కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
మొత్తానికి థియేటర్లలో మిస్సయిన వారు, ఈ వీకెండ్లో ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సినిమానో తేల్చుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చలను మరింత వేడెక్కిస్తున్నారు.
