Chandrababu

Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు, సారె సమర్పణ!

Chandrababu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనకదుర్గమ్మ వారికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమలతో కూడిన చీర, సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా సీఎం అమ్మవారిని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *