Prabhas: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అన్డిస్ప్యూటెడ్ నంబర్ వన్ బాక్సాఫీస్ సుల్తాన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘రెబల్ స్టార్ ప్రభాస్’. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా ట్రెండ్‌కు రూట్ మ్యాప్ వేసిన డార్లింగ్.. ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి 2898 AD’ లాంటి భారీ బ్లాక్బస్టర్లతో తన గ్లోబల్ మార్కెట్ రేంజ్ ఏంటో దేశవ్యాప్తంగా ప్రూవ్ చేశారు. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రభాస్‌తో ఒక్కటైనా సినిమా చేయాలని కలలు కనడం సహజం. ఆయన పేరు చెబితేనే ఎంతటి భారీ బడ్జెట్ పెట్టడానికైనా ప్రొడ్యూసర్లు వెనుకాడరు.
అయితే, ఇంతటి తిరుగులేని మార్కెట్, స్టార్డమ్ ఉన్న ప్రభాస్ విషయంలో కొంతమంది డైరెక్టర్లు మాత్రం చేజేతులా గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నారు. ప్రభాస్ మార్కెట్‌ను నమ్మి కొత్త టెక్నాలజీ ప్రయోగాల పేరుతో ఆయన కెరీర్‌కే భారీ డిజాస్టర్లు ఇచ్చారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ తన ప్రాజెక్ట్ సెలెక్షన్ విషయంలో, ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ విషయంలో చాలా అలర్ట్‌గా ఉంటూ తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు.
టెక్నాలజీ పేరుతో ప్రయోగాలు.. ఆదిపురుష్ దెబ్బతో నేర్చుకున్న పాఠం..
గతంలో బాలీవుడ్ దర్శకులు తమ ట్రాక్ రికార్డు చూపించి ప్రభాస్ దగ్గరికి రావడం, తీరా సెట్స్‌పైకి వెళ్లాక అసలు కథను వదిలేసి అనవసర ప్రయోగాలతో సినిమాను పాడుచేయడం చూశాం. ‘తానాజీ’ లాంటి సూపర్ హిట్ తీసిన ఓం రౌత్.. ప్రభాస్ ఇమేజ్ను అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్ల బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. మోషన్ క్యాప్చర్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ అంటూ హడావుడి చేసినప్పటికీ.. ఆ టెక్నాలజీపై సరైన గ్రిప్, ప్యాషన్ లేకపోవడంతో కార్టూన్ గ్రాఫిక్స్‌తో సినిమాను దారుణంగా చెడగొట్టారు. చివరకు ప్రభాస్ లాంటి స్టార్ లుక్స్ పైన కూడా దారుణమైన ట్రోల్స్ వచ్చేలా చేశారు.
కథ కంటే ప్రయోగాలకే ప్రాధాన్యమిస్తే నో ఎంట్రీ..
సినిమాకు నిజంగా అవసరమా లేదా అనేది ఆలోచించకుండా, కేవలం భారీ బడ్జెట్ దొరుకుతుందని హైటెక్ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న దర్శకుల వల్ల ప్రభాస్ చాలా నేర్చుకున్నారు. అందుకే కేవలం గత హిట్ల ట్రాక్ రికార్డును మాత్రమే చూసి ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పే రోజులు పోయాయని, పక్కాగా ‘బౌండెడ్ స్క్రిప్ట్’ (పూర్తిగా లాక్ చేసిన కథ-కథనం) ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్లను పక్కన పెట్టారా? అసలు నిజమేంటి?..
ఓం రౌత్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ ఇకపై హిందీ దర్శకులతో పనిచేయరని సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క డైరెక్టర్ తప్పు చేశాడని మొత్తం బాలీవుడ్‌ను పక్కన పెట్టే మనస్తత్వం ప్రభాస్ది కాదు. కాకపోతే కథలో కొత్తదనం, స్క్రిప్ట్‌పై పూర్తి క్లారిటీ ఉంటేనే ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇటీవల కాలంలో ‘దురంధర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ కనుక ప్రభాస్‌ను మెప్పిస్తే, వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉంటుంది.
రాబోయే రెండేళ్ల ప్రభాస్ బిగ్గెస్ట్ లైనప్ ఇదే..
ప్రభాస్ డైరీ ప్రస్తుతం కనీసం రెండేళ్ల వరకు ఫుల్ టైట్ షెడ్యూల్‌తో నిండిపోయింది. ఇండియాలోని టాప్ డైరెక్టర్లతో ఆయన లైనప్ చూస్తేనే పూనకాలు వస్తాయి..
-
ఫౌజీ (Fauji):హను రాఘవపూడి దర్శకత్వంలో చారిత్రాత్మక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
-
స్పిరిట్ (Spirit):సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ మోస్ట్ అగ్రెసివ్ కాప్ రోల్లో నటించనున్న భారీ యాక్షన్ మూవీ. ఈ సినిమాపై పాన్-వరల్డ్ స్థాయిలో భారీ అంచనాలున్నాయి.
-
కల్కి 2 (Kalki 2):నాగ్ అశ్విన్ విజువల్ వండర్ పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పార్ట్-2 లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మధ్య రాబోయే వార్ సీక్వెల్స్ కోసం షూటింగ్ స్టార్ట్ కానుంది.
-
సలార్ 2: శౌర్యాంగ పర్వం (Salaar 2):ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో దేవ – వరదరాజ మన్నార్ కథను ముగింపుకు తీసుకెళ్లే బిగ్గెస్ట్ యాక్షన్ వార్. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు తన వద్దకు కథలు తీసుకువస్తున్న ఇతర దర్శకులందరినీ ప్రభాస్ హోల్డ్‌లోనే పెడుతున్నారు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ ఫలితాలు చూసిన తర్వాతే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై ప్రభాస్ అధికారికంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ప్రయోగాల పేరుతో చేసే మోసాలకు తావులేకుండా, కంటెంట్ మీదే పూర్తి భారం వేసి ప్రభాస్ వేస్తున్న అడుగులు ఆయన కెరీర్‌ను మరింత పీక్స్‌కు తీసుకెళ్తాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
