Paidi Sindhura

Paidi Sindhura: బీజేపీ నాయకురాలిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా

Paidi Sindhura: శ్రీకాకుళం నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు డాక్టర్ పైడి సింధూర మేయర్ పదవికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో నాయకురాలిగా గుర్తింపు పొందిన ఆమె, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.

వైద్యురాలిగా ప్రజలకు సేవలందిస్తున్న డాక్టర్ పైడి సింధూర, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్‌తో పాటు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు

వైద్య సహాయం అవసరమైన వారికి అండగా నిలుస్తూ, పలువురికి ఆపరేషన్లు చేయించడంలో తన వంతు సహకారం అందించినట్లు ఆమె సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందారు.

ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు, రాజకీయాల ద్వారా నగర అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో డాక్టర్ సింధూర ముందుకు సాగుతున్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దృక్పథంతో మేయర్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రజాసేవకు అంకితమవుతానని డాక్టర్ పైడి సింధూర వెల్లడించినట్లు సమాచారం.

వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ పైడి సింధూర రాజకీయంగా కూడా నగర ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుండటంతో, బీజేపీ అధిష్ఠానం మేయర్ అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *