Amazon Great Indian Festival Sale 2026: పండుగల సీజన్ సందర్భంగా ఆన్లైన్ షాపర్లకు అమెజాన్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026’ (Amazon Great Indian Festival Sale 2026) నేటితో (అక్టోబర్ 8) అందరు వినియోగదారుల కోసం అధికారికంగా ప్రారంభమైంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ ఇలా అన్ని కేటగిరీల్లో మునుపెన్నడూ చూడని రీతిలో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు & క్యాష్‌బ్యాక్ డీల్స్..
కొనుగోలుదారుల కోసం అమెజాన్ అదనపు పొదుపు ప్రయోజనాలను అందిస్తోంది..
-
SBI కార్డ్ ఆఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కస్టమర్లకు 10% తక్షణ డిస్కౌంట్ (Instant Discount) లభిస్తుంది.
-
అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్: అమెజాన్ ప్రైమ్ (Prime) మెంబర్లకు 5% అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ వినియోగదారులకు 3% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
-
నో కాస్ట్ EMI & పే లేటర్ ఆఫర్: ఎంపిక చేసిన బ్రాండ్లు, ప్రొడెక్టులపై వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సదుపాయం ఉంది. రూ.1,500 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లకు ‘Amazon Pay Later’లోని ‘Pay in 3’ వడ్డీ లేని ఈఎంఐ ఎంచుకుంటే 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
స్మార్ట్ఫోన్లపై స్పెషల్ ప్రైస్‌లు & డీల్స్..
ప్రీమియం ఫ్లాగ్షిప్స్ నుంచి బడ్జెట్ 5G ఫోన్ల వరకు భారీ ధర తగ్గింపులు అమల్లోకి వచ్చాయి.
| స్మార్ట్‌ఫోన్ మోడల్ | సేల్ ప్రత్యేక ధర | ప్రత్యేక ఆఫర్లు |
| Samsung Galaxy S25 Ultra | ₹84,999 | అదనంగా ₹5,000 కూపన్ డిస్కౌంట్ |
| Samsung Galaxy Z Fold 7 5G | ₹1,29,999 | బ్యాంక్ కార్డ్ & ఎక్స్ఛేంజ్ బోనస్ |
| Xiaomi 17 | ₹59,999 | బ్యాంక్ ఆఫర్ & ఎక్స్ఛేంజ్ |
| iQOO 15R | ₹46,499 | ఇన్స్టంట్ డిస్కౌంట్ |
| OnePlus Nord 6 | ₹42,999 | ఎస్బీఐ కార్డ్ ఆఫర్లు |
| OnePlus Nord CE 6 | ₹33,999 | నో కాస్ట్ EMI సదుపాయం |
| Samsung Galaxy A56 5G | ₹31,999 | అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ |
| Redmi 15C 5G Prime | ₹15,999 | బడ్జెట్ సెగ్మెంట్ బెస్ట్ డీల్ |
| Lava Bold N4 Pro 5G | ₹13,999 | అతి తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్ |
కేటగిరీల వారీగా భారీ తగ్గింపులు..
-
ఎలక్ట్రానిక్స్ & యాక్సెసరీలు: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, మొబైల్ యాక్సెసరీలపై 80% వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
-
స్మార్ట్ టీవీలు & ప్రొజెక్టర్లు: 32 అంగుళాల బడ్జెట్ టీవీల నుంచి 75 అంగుళాల ప్రీమియం 4K స్మార్ట్ టీవీల వరకు 65% వరకు భారీ తగ్గింపు ఉంది.
-
గృహోపకరణాలు (Home Appliances): పండుగల సీజన్ కావడంతో వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గీజర్లపై 65% వరకు రాయితీలు అందిస్తున్నారు.
-
ఫ్యాషన్ & బ్యూటీ: దుస్తులు, పాదరక్షలు, బ్యూటీ ప్రొడెక్టులపై 80% వరకు ఆఫ్ నడుస్తోంది.
-
బైక్స్, స్పోర్ట్స్ & బొమ్మలు: సైకిళ్లు, ఫిట్నెస్-స్పోర్ట్స్ పరికరాలు, పిల్లల బొమ్మలపై 50% వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.
లోకల్ బ్రాండ్లు & స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట..
అమెజాన్ లాంచ్‌ప్యాడ్ (Launchpad) ద్వారా ఎంపిక చేసిన వినూత్న స్టార్టప్ ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ కల్పిస్తున్నారు. అలాగే భారతీయ చేతివృత్తుల కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ‘అమెజాన్ కరిగర్’ (Karigar), ‘అమెజాన్ సహేలి’ (Saheli) స్టోర్లలోని సంప్రదాయ ఉత్పత్తులపై ఏకంగా 85% వరకు రాయితీలు ఇస్తున్నారు.
వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు బ్యాంక్ ఆఫర్లు, ప్రోడక్ట్ పేజీల్లో ఉండే కూపన్లను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చని అమెజాన్ సూచిస్తోంది.
