Naga Chaitanya: టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే తన ఆరోగ్యం, శరీర దృఢత్వానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే చైతు.. తాజాగా తెలంగాణ పోలీసులతో కలిసి సరదాగా చేసిన ‘పుష్‌అప్ ఛాలెంజ్’ (Push-up Challenge) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన నాగచైతన్య, అక్కడ విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులతో కలిసి ఏమాత్రం తడబడకుండా ఉత్సాహంగా పుష్‌అప్స్ చేస్తూ కనిపించారు. చైతన్య స్పీడ్ చూసి అక్కడున్న పోలీస్ సిబ్బంది సైతం ఈలలు, చప్పట్లతో ఆయనను ఉత్సాహపరిచారు.
ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ – చైతూ మార్క్..
ఖాకీ యూనిఫాంలో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి నాగచైతన్య పోటీపడుతూ పక్కా ఫామ్‌తో పుష్‌అప్స్ తీశారు. ఆయన స్టామినా, బాడీ బ్యాలెన్స్ చూసి పోలీసులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో వైరల్‌గా మారింది. కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోలు ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నాగచైతన్య.. ఇలా ఫిట్‌నెస్ విషయంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ సందడి చేయడంతో అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
View this post on Instagram
