Crime News

Crime News: ప్రియురాలి గొంతుకోసి.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Crime News: విజయవాడ నగరంలో శనివారం ఉదయం దారుణమైన రక్తపాతం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడిన ఓ యువకుడు విచక్షణ కోల్పోయి ప్రేమోన్మాదిలా మారాడు. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలి మెడపై కత్తితో దాడి చేశాడు. ఆ వెంటనే తాను కూడా సమీపంలోని భవనం పైనుంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో జరిగిన ఈ జంట మరణాల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు, విషాదాన్ని నింపింది.
ప్రేమ పేరుతో మొదలై.. అనుమానం, వేధింపులతో ముగింపు..
న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన మహాలక్ష్మి (19) ఓ బట్టల దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఆమె తన నానమ్మ శాంతమ్మ, చెల్లెలితో కలిసి నివాసముంటోంది. అదే ప్రాంతానికి చెందిన చిన్నారావు అలియాస్ చిన్నా (22)తో ఆమెకు గతంలో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. కానీ  చిన్నా ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, నిత్యం అనుమానంతో వేధిస్తుండటంతో దాదాపు ఏడాది క్రితమే అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మహాలక్ష్మి స్పష్టం చేసింది. అయితే చిన్నా మాత్రం ఆమెను వదలకుండా నిరంతరం వెంటపడుతూ వేధించేవాడు.
షాపు వద్దకు వెళ్లి గొడవలు..
గత మూడు నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. మహాలక్ష్మి పనిచేసే బట్టల దుకాణం వద్దకు వెళ్లి “నన్నే కాదంటావా?” అంటూ బీరు సీసాతో తన తల తానే పగలగొట్టుకుని రచ్చ చేశాడు. పలుమార్లు ఆమెపై చేయి చేసుకున్నాడు. పెళ్లి కాకముందే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడని, ఇలాంటి వ్యక్తితో జీవితం సాధ్యం కాదని మహాలక్ష్మి మరింత ఖరాఖండీగా చెప్పేసింది.
శనివారం ఉదయం ఏం జరిగింది? – గొంతుకోసి పైనుంచి దూకేశాడు..
తన మాట వినడం లేదన్న కసితో రగిలిపోయిన చిన్నా.. శనివారం ఉదయం పథకం ప్రకారం కత్తితో ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో మహాలక్ష్మితో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై బలంగా నరికాడు. ఊహించని దాడితో మహాలక్ష్మి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ లో చేర్చారు ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
డాబా పైనుంచి దూకి ఆత్మహత్య..
రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియురాలిని చూసి భయాందోళనకు గురైన చిన్నా.. వెంటనే బయటకు పరుగులు తీసి సమీపంలోని ఓ డాబా పై నుండి దుక్కి ఆత్మహత్యా చేసుకున్నాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *