KCR Farmhouse Lands: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేద దళితులకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన మరుసటి రోజే రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన 30 రోజుల గడువు నేపథ్యంలో సిద్ధిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించగా, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కుక్ తహసీల్దార్ సరిత, ఏడీ సుదర్శన్ నేతృత్వంలోని రెవెన్యూ బృందం గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేపట్టింది.
క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలన – సర్వే నెం. 325పై ఫోకస్
“రెవెన్యూ అధికారులకు 30 రోజుల సమయం ఇస్తున్నాం. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు మాత్రమే కాదు, బాధ్యులైన మంత్రులపై కూడా చర్యలు తప్పవు” అని రేవంత్ స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు మొదలుపెట్టిన ఈ విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటుందనేది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
