Alia Bhatt

Alia Bhatt: స్పీడ్ పెంచిన అలియా భట్.. ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలో ఛాన్స్..?

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గురించి తెలియనివారు ఉండరు. ఇప్పుడు ఆమె వరుసగా హిందీతోపాటు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘RRR’తో తెలుగు తెరకు పరిచయమైంది ఆలియా భట్. ఆ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ‘సీత’గా తనదైన ముద్ర వేసి టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆలియా భట్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో రాబోయే రెండు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
‘కల్కి 2’లో కీలక పాత్ర?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘కల్కి 2’లో ఆలియా భట్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతోందని, ఈ మేరకు చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. కల్కి-1 లో దీపిక నటించిన పాత్రని ఆలియా భట్‌తో రీప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా స్టార్టింగ్ పది నిమిషాల్లోనే దీపికని మర్చిపోయి ఆలియా క్యారెక్టర్‌తో కనెక్ట్ చేయడానికి నాగ్ అశ్విన్ ఎలాంటి స్క్రీన్ ప్లే ట్రిక్ వాడతారో చూడాలి.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో రీ-యూనియన్
మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా ‘డ్రాగన్’లో కూడా ఆలియా భట్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపియ్యబోతున్నట్లు తెలుస్తోంది. ‘RRR’ తర్వాత మరోసారి తారక్, ఆలియా కలిసి నటించబోతుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె క్యారెక్టర్ స్టోరీని మలుపు తిప్పే పాత్ర కానుంది.
ఈసారి అతిథి పాత్ర కాదు.. పూర్తి స్థాయి క్యారెక్టర్లు!
‘RRR’లో ఆలియా పాత్ర కొంత సమయమే కనిపించినప్పటికీ, ఆ సినిమా సాధించిన ఘన విజయం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ‘కల్కి 2’, ‘డ్రాగన్’ విషయంలో మాత్రం ఆమె పాత్రల నిడివి, ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు భారీ సినిమాలు అధికారికంగా ఖరారైతే, తెలుగు ఇండస్ట్రీలో ఆలియా స్థానం మరింత సుస్థిరం కావడం ఖాయం.

ప్రస్తుతం ఈ వార్తలపై మూవీ టీమ్స్ నుంచి అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు వరుసగా ఆలియా వైపు మొగ్గు చూపుతుండటం చూస్తుంటే, ఆమె తెలుగు బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *