Viral News

Viral News: పిల్లలకోసం.. 47 ఏళ్ల వయసులో చీరకట్టుతో పరుగులు..!

Viral News: క్రీడా దుస్తులు లేవు.. పాదాలకు రన్నింగ్ షూస్ లేవు.. అథ్లెట్‌గా ఎటువంటి ముందస్తు ట్రైనింగ్ అంతకన్నా లేదు. ఆమె రోజు కట్టుకునే నిరాడంబరమైన చీర, కాళ్లకు సాధారణ చెప్పులతో పరుగు పందెం ట్రాక్‌పైకి దిగింది. బురద రోడ్డుపై చెప్పులు జారడంతో వాటిని చేత్తో పట్టుకుని, రాళ్లు, రప్పలను లెక్కచేయకుండా వట్టి కాళ్లతోనే పరుగు తీసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగై పట్టణానికి చెందిన 47 ఏళ్ల రమాబాయి రణవీర్ అనే ఒంటరి తల్లి, స్థానిక ‘అమృత్ దౌడ్’ మారథాన్‌లో యువ రన్నర్లను వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిడ్డల చదువుల కోసమే ఈ పోరాటం..

భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని ఒంటరిగానే మోస్తున్న రమాబాయి, ఇతరుల ఇళ్లలో వంట మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఒక కూతురు బీఎస్సీ చదువుతుండగా, మరో కూతురు పోలీస్ ఉద్యోగానికి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆమె ఇళ్లలో వంట చేస్తే వచ్చే డబ్బులతో ఆమె ఇల్లు గడవడమే సరిపోతుంది. దింతో ఆమె పిల్లల చదువుకోసం డబ్బులు వస్తాయి అంటే వేరే పనులు చెయ్యడానికి కూడా అలచించకుండా చేస్తారు.
అలాగే ఒక్క రోజు మారథాన్‌లో గెలిస్తే వచ్చే రూ.3,000 ప్రైజ్ మనీ వస్తుంది అని తెలిసింది. అందరికి అవి డబ్బులుగా కనిపిస్తే ఆమెకి మాత్రం తన బిడ్డల పుస్తకాలు, కాలేజీ ఫీజులకు తోడ్పడే అమూల్యమైన సొమ్ము లాగా కనిపించింది. ఆ దృఢ సంకల్పంతోనే ఆమె పరుగు పందెంలో పాల్గొంది.
చెప్పులు విడిచి వట్టి కాళ్లతో పరుగు..
వర్షం వల్ల ట్రాక్ అంతా బురదమయంగా మారడంతో మధ్యలోనే ఆమె చెప్పులు జారడం మొదలయ్యాయి. అయినా ఆమె ఆగలేదు.. చెప్పులను చేతిలోకి తీసుకుని వట్టి కాళ్లతోనే లక్ష్యం వైపు దూసుకుపోయింది.

ముగింపు గీత వద్ద విస్మయం..

ట్రైనింగ్ తీసుకుని, ఖరీదైన స్పోర్ట్స్ గేర్‌తో పరుగెత్తిన యువ అథ్లెట్లను దాటుకుంటూ రమాబాయి మొదటి స్థానంలో ముగింపు గీతను తాకింది. ఆమెతో పాటు పాల్గొన్న ఆమె కూతురు పూజ ఈ పరుగులో రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

నిర్వాహకులు రూ.3,000 నగదు బహుమతి, ట్రోఫీని అందజేసినప్పుడు.. ఈ డబ్బును పూర్తిగా తన పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోలుకే వాడతానని రమాబాయి చెప్పడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. కాళ్లకు చెప్పులు లేకుండా చీరతో పరుగెత్తుతున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, “పిల్లల భవిష్యత్తు కోసం తల్లిని మించిన యోధురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *