SKM: మన పౌరాణికాలకు సరికొత్త రూపం..6 భాషల్లో పిల్లల్ని, పెద్దల్ని అలరించనున్న జీ5 కిడ్స్ సిరీస్.. ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించి అలరిస్తూ జీ5 అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. అందులో భాగంగా పిల్లలకు ఇష్టమైన, సురక్షితమైన, హాస్యాన్ని అందించేలా కిడ్స్ జెడ్ (KidZ).. కంటెంట్‌ను డిజైన్ చేసే ప్రదేశంగా మారింది. తాజాగా దీన్ని మరింతగా బలోపేతం చేస్తూ మరో సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (SKM) ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన అత్యధికంగా అమ్ముడైన పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇది జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.
వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించే ప్రపంచానికి పునాది వేస్తుంది.
