Chandrababu

Chandrababu: వైసీపీది గొడ్డలి పార్టీ.. ‘మూడు ముక్కలాట’కు జనం చెక్ పెట్టారు!

Chandrababu: “గతంలో ఇదే రాయలసీమ గడ్డ పైనుంచి ఉపాధి హామీ (నరేగా) పథకానికి నాంది పడితే.. నేడు దానికి మరింత మెరుగైన మెరుగులు దిద్ది, గ్రామాల ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త ‘VB-G RAM-G’ (విబి-జి రామ్-జి) పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం ఒక చరిత్ర” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్డీఏ భారీ బహిరంగ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరు ప్రజల చిరకాల కోరిక మేరకు ఈ ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

1. రూ. 11,000 కోట్లతో పల్లెల పునర్నిర్మాణం: 185 రోజుల ఉపాధి!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు:

ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 7,700 కోట్లు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 4,000 కోట్లు అందిస్తోంది. మొత్తం రూ. 11,000 కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు.గతంలో 100 రోజులు ఉన్న పనిదినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచామని, దీనికి తోడు వ్యవసాయ సీజన్ హాలిడే (60 రోజులు) కలుపుకుంటే.. ఏడాదిలో మొత్తం 185 రోజుల పాటు పేదలకు సుస్థిరమైన ఉపాధి, ఆర్థిక భరోసా లభిస్తుందని సీఎం తెలిపారు. గతంలో ఉపాధి నిధుల్లో జరిగిన అవకతవకలకు ఇకపై తావుండదని, అంతా డిజిటల్ మస్టర్ రోల్స్, ఆధార్ లింకింగ్, జియో ట్యాగింగ్, మరియు రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పారదర్శకంగా సాగుతుందని స్పష్టం చేశారు.

2. రికార్డుల రారాజు పవన్ కళ్యాణ్.. గ్రామాల్లో ప్రగతి పరుగులు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రపథాన దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కొనియాడారు.

పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామసభలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గిన్నిస్ రికార్డు సృష్టించారు. గడిచిన రెండేళ్లలో రూ. 16,695 కోట్లు ఖర్చు చేసి 7,000 కి.మీ. సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 1.07 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించారు. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు సాధించి, దేశంలోనే ఏపీని నెంబర్ 2 స్థానంలో నిలబెట్టారు. ఈ ఏడాది మరో రూ. 10,000 కోట్లతో డొంక రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లను నిర్మించబోతున్నారు.

3. వైసీపీది గొడ్డలి పార్టీ.. ‘మూడు ముక్కలాట’కు జనం చెక్ పెట్టారు!

ప్రతిపక్ష వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. “మన రాష్ట్రంలో ఒక ‘గొడ్డలి పార్టీ’ ఉంది, వారు రోజుకో డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జై కొట్టి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ‘మూడు ముక్కలాట’ ఆడారు. ఇప్పుడు కొత్తగా ‘మేవిగన్’ అంటున్నారు” అని ఎద్దేవా చేశారు. అమరావతి అనేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులున్న దేవతల రాజధాని అని, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, వైసీపీ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు.

4. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మెగా ప్రాజెక్టులు:

ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం కొన్ని కీలక మైలురాళ్లను పంచుకున్నారు..

కోడూరు నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు:

స్థానిక శాసనసభ్యులు, నేతల విజ్ఞప్తి మేరకు కోడూరు అభివృద్ధికి చంద్రబాబు తక్షణ నిధులను మంజూరు చేశారు..

  1. ఆర్టీసీ బస్ స్టాండ్: కోడూరు ప్రజల చిరకాల వాంఛ అయిన నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి రూ. 5 నుండి 6 కోట్లు మంజూరు.

  2. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్: రుర్బన్ పథకం కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిపార్ట్‌మెంట్ ద్వారా రూ. 8 కోట్లు శాంక్షన్.

  3. నూతన పాఠశాల: చిత్వేల్ మండలంలో ఏపీఎండీసీ ద్వారా పిల్లల కోసం స్కూల్ భవన నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయింపు.

  4. కోడూరు – వెంకటగిరి రోడ్డు: ఫారెస్ట్ క్లయిరెన్స్ అడ్డంకులను తొలగించి, 22 కిలోమీటర్ల ఈ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ.

రాయలసీమను రాళ్ల సీమగా కాదు.. రతనాల సీమగా మారుస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ప్రకారం 2047 నాటికి భారతదేశాన్ని అగ్రదేశంగా, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా నిలబెట్టడమే మా సంకల్పం” అని సీఎం చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *