Pawan Kalyan

Pawan Kalyan: కూలీ కాదు ఇకపై శ్రామికులు.. ‘వీబీజీ రామ్‌జీ’తో సరికొత్త విప్లవం..!

Pawan Kalyan: గ్రామీణ ప్రాంతాల సమగ్ర రూపురేఖలను మార్చేందుకు, పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పథకం ‘వికసిత్ భారత్ జీరామ్‌జీ’ (VB-G RAM-G – విబి-జి రామ్-జి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా ప్రారంభమైంది. ముక్కావారిపల్లె వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని, పథకం కార్యాచరణను ప్రజల ముందుకు తెచ్చారు.

తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె వేదికగా జరిగిన ‘వికసిత్ భారత్ జీరామ్‌జీ’ (VB-G RAM-G) ల్యాంచింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఈ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి రంగాన్ని మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇకపై కూలీ అనే పదానికి బదులుగా గౌరవప్రదంగా ‘శ్రామికులు’ అనే పదాన్ని తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలు కోసం మొత్తం రూ. 12,845 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. శ్రామికులకు అదనంగా 25 రోజుల పనిదినాల భరోసా కల్పించడం ఈ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన అంశమన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహకారంతో ఏపీలో ఈ పథకాన్ని వంద శాతం విజయవంతంగా అమలు చేసి చూపిస్తామన్నారు.

2. రైతులకు మేలు: వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం

గ్రామీణ ఉపాధి పనుల వల్ల వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

వ్యవసాయ పనుల సీజన్‌లో శ్రామికుల కొరత రాకుండా ఉండేందుకు గాను.. ఉపాధి పనులకు 60 రోజుల పాటు విరామం (బ్రేక్) ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అటు రైతులకు, ఇటు శ్రామికులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని వివరించారు.

3. గ్రామీణాభివృద్ధిలో ఏపీ టాప్.. సరికొత్త ప్రపంచ రికార్డు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో దూసుకుపోతోందని డిప్యూటీ సీఎం కొనియాడారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామసభలు నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించామని గుర్తుచేశారు.గత రెండేళ్ల కాలంలో ‘పల్లె పండుగ’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ. 16,695 కోట్ల ఉపాధి నిధులను పల్లెల ప్రగతి కోసం అద్భుతంగా వినియోగించామని స్పష్టం చేశారు.

కేంద్రానికి ధన్యవాదాలు..

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, గ్రామీణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం నుండి పూర్తిస్థాయిలో సహకారం అందుతోందని, అందుకనే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *